NTR: తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆకుల దుర్గా ప్రసాద్ సూచించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తేవాలన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి మెరుగుదలకు చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తిరువూరు ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి అభివృద్ధి'


