హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్తపాలెం-1లో సోమవారం పిజీఆర్‌ఎస్‌'

ASR: చింతపల్లి మండలం కొత్తపాలెం-1 స్వర్ణ గ్రామ సచివాలయంలో ఈనెల 24వ తేదీ సోమవారం పిజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. ఆదివాసీలు తమ సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. అర్జీలను అధికారులు సకాలంలో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.