హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరం అభివృద్ధికి కలెక్టర్ పిలుపు

W.G: పరిశుభ్రమైన నగరాలు, పల్లెలతోనే 'స్వర్ణాంధ్ర' సాధ్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ పార్కులో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛతా చర్యలు చేపట్టారు. స్వచ్ఛత అనేది కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.