హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'15 ఏళ్లుగా చెట్ల కిందే చదువులు'

ASR: అరకువేలి మండలం మాలసింగారం ప్రాథమిక పాఠశాల 15 ఏళ్లుగా శిథిలావస్థలో ఉండటంతో 40 మంది చిన్నారులు చెట్ల కింద, ఇళ్ల వరండాల్లో చదువుకుంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. కలెక్టర్ స్పందించి శాశ్వత భవనం నిర్మించాలని కోరుతున్నారు.