E.G: రాజానగరం మండలం సంపత్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఆ సంస్థ ఈఈ నటరాజన్ తెలిపారు. సంపత్ నగర్, జియారంపాలెం, నామవరం, పుణ్య క్షేత్రం, భూపాలపట్నం, కొత్త తుంగపాడులో వ్యవసాయ బోర్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు గాను ఈ అంతరాయం కలుగుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


