ASR: కొయ్యూరు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన మాగాపు చక్రవర్తి, గంగాధర్‌పై గతంలో పలు గంజాయి అక్రమ రవాణా, సంబంధిత కేసులు నమోదయ్యాయని సీఐ బీ. శ్రీనివాసరావు తెలిపారు. పదేపదే గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిర్బంధ ఉత్తర్వుల మేరకు ఇద్దరినీ విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గంజాయి అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం'


