హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్: ఎమ్మెల్యే

E.G: వి.ఎల్.పురం పాత లారీ స్టాండ్ వద్ద ఖేలో ఇండియా నిధులతో నిర్మిస్తున్న ఆరీనా-2 ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. డిసెంబర్ నాటికి 80 శాతం పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.53 కోట్లతో అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.