అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో విస్తృతంగా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి, అనంతరం మొక్కలు నాటారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నిర్వాహకులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కళాశాలలో మొక్కల పెంపకం కార్యక్రమం


