AKP: నక్కపల్లి మండలం ఎన్.నరసాపురంలో ఇంటికి నిప్పంటించిన కేసులో బాధితురాలి మూడో కుమారుడు సైనవరపు శ్రీను (34)ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలోనే ఘటనకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని సీఐ జె. మురళి తెలిపారు. తమ్ముడి వివాహం కోసం తల్లి భూమిని విక్రయించాలన్న నిర్ణయాన్ని శ్రీను వ్యతిరేకించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంటికి నిప్పు పెట్టిన నిందితుడు అరెస్టు'


