KDP: పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శనివారం సిద్ధవటం పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో పోలీసులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను నరకడం నేరమని తెలిపారు. కాలుష్య నివారణకు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చెట్ల సంరక్షణ మనందరి బాధ్యత: సీఐ


