ATP: గుత్తి కోట వీధిలో శనివారం ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోట వీధికి చెందిన మాజీ మున్సిపల్ ఉద్యోగి చంద్ర బెంగళూరు నుంచి ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాన్ని తెప్పించారు. దారి పొడవున స్వామివారి విగ్రహాన్ని భక్తులు దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహం ఊరేగింపు


