హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబై ఇండియన్స్‌లో కీలక నియామకం

MI ఫ్రాంచైజీ తమ క్రికెట్ వ్యవస్థలో కీలక మార్పు చేసింది. మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జుబిన్ భరూచాను 'డైరెక్టర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్'గా నియమించింది. ఆటగాళ్ల అభివృద్ధి, పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్‌లు, దీర్ఘకాలిక ప్రణాళికలను బలోపేతం చేయడమే ఆయన ప్రధాన బాధ్యత. సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి భరూచా పనిచేస్తూ.. యువ ప్రతిభను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాడు.