హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం: HM

భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సైన్స్ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డా. రమణరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 24న డెమో, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.