హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంజన్నకు శ్రావణమాస ప్రత్యేక పూజలు

అన్నమయ్య: శ్రావణమాస రెండవ శనివారాన్ని పురస్కరించుకుని పులివెందులలోని ఆంజనేయస్వామి ఆలయాలలో భక్తులు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులివెందులలోని స్థానిక తూర్పు, పడమటి ఆంజనేయస్వామి ఆలయాలు, కొత్త బస్టాండ్లోని నూతన ఆంజనేయస్వామి, తదితర అంజన్న ఆలయాలకు భక్తులు వెళ్లి ఆకు పూజలు చేశారు. ఆయా ఆలయాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.