హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం

TPT: హైదరాబాద్‌కు చెందిన దాత శ్రీ బండి సత్యనారాయణ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని దాత టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడుకి డీడీ రూపంలో అందించారు. శ్రీవారి భక్తులకు అన్నప్రసాద సేవలో భాగస్వాములైన దాతలకు బీ. ఆర్ నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.