హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

JGL: కొత్త ధాంరాజ్‌పల్లి మాజీ సర్పంచ్ ఉత్కం హన్మంత్‌గౌడ్ తనయుడు ఇటీవల మృతిచెందడంతో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో వారి వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు.