హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగం కావాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.