హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ గోపురాల పునరుద్ధరణకు శ్రీకారం

అన్నమయ్య: ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయ గోపురాల మరమ్మతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. దాదాపు రూ.96 లక్షల వ్యయంతో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం తూర్పు దిశలోని ద్వారం వైపు గోపురం పనులు కొనసాగుతున్నాయి. మట్టి రాజుల కాలంలో నిర్మించిన ఈ గోపురాలకు మరమ్మతులు చేపట్టడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.