WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి తెలిపారు. వరంగల్ మేయర్ అభ్యర్థిగా తానే ఉంటానని ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచిందన్నారు. అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. భవిష్యత్తులో పార్టీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
వరంగల్ మేయర్ అభ్యర్థిగా నేనే: జంగా రాఘవరెడ్డి


