TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా అర్చన, కైంకర్యాల్లో జరిగిన దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. ఈనెల 23న అంకురార్పణ, 24న పవిత్రాల సమర్పణ, 25న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు


