హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు నాలుగు గ్రామాల్లో కాంగ్రెస్ నూతన కమిటీల ఏర్పాటు

MLG: రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు నారాయణపూర్, మల్లయ్యపల్లి, 8 గంటలకు బూరుగుపేట, చక్రవర్తిపల్లి గ్రామాల్లో కమిటీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.