హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెంలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు

బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం ఐలాండ్ సెంటర్‌లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.