హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన MPDO

AKP: కోటవురట్ల మండలం పాములవాక జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో పాటు రుచిగా ఉండాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. ఈ పథకాన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రఘురాం, టీడీపీ నాయకుడు వేచలపు భాస్కరరావు పాల్గొన్నారు.