KRNL: కల్లూరు అర్బన్ 21వ వార్డు మహాలక్ష్మినగర్ పార్కులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని పారిశుద్ధ్య పనుల్లో భాగస్వాములయ్యారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని తెలిపారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతతో ఆరోగ్యకర సమాజం సాధ్యం: ఎమ్మెల్యే


