హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీఓ 97 రద్దు చేయాలని నిరసన

MNCL: జీఓ 97 రద్దు చేయాలని నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. శనివారం కళాశాల ఎదుట విద్యార్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు పీడీఎస్యూ, ఏఐఎస్బీ విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. జీఓ 97తో పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే అవకాశాలు దెబ్బతింటాయని తెలిపారు.