హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్లు, యూజీడీ పనులకు శ్రీకారం

SRD: అమీన్పూర్ డివిజన్‌లో రూ.8.19 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడీ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. రాజేంద్రరెడ్డి, సాయి అంబిక, పీఎన్‌ఆర్, నరేంద్రనగర్ తదితర కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం, విద్యుత్ మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.