హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగొండ భూనిర్వాసితులకు రూ. 250 కోట్ల పరిహారం

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు శనివారం రూ.250 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో నిర్వాసిత కుటుంబాలకు రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటి వరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.768 కోట్లను పరిహారంగా అందించింది. శనివారం 2027 కుటుంబాలకు పరిహారం అందించారు.