హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్‌లో దోమల నివారణపై నిర్లక్ష్యం?

WGL: GWMC పరిధిలోని పలు కాలనీల్లో దోమల బెడద పెరుగుతున్నా, వారం రోజులుగా దోమల మందు పిచికారీ జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపించిందని వాపోతున్నారు. విషజ్వరాలు ప్రబలకముందే బల్దియా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి దోమల నివారణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరుతున్నారు.