హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ ఢీకొని ఇద్దరు స్నేహితులు మృతి

ATP: లారీ ఢీకొని ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మద్దికేర మండలం మదనంతపురంకు చెందిన మహేంద్ర, బాలరాజు  మార్గంమధ్యలో జొన్నగిరి వద్ద పత్తికొండ నుంచి వస్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వారిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.