హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ షెడ్‌కు భూమిపూజ

ADB: బేల మండలం అవాల్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే పాయల శంకర్ సహకారంతో రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ షెడ్‌కు శనివారం భూమిపూజ చేశారు. సర్పంచ్ అనిల్, ఉపసర్పంచ్ దినేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థుల సౌకర్యార్థం షెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.