BPT: బాపట్ల పురపాలక సంఘం 10వ వార్డు ప్యాడిసన్‌పేటలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ యం. హాసిని ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మునిసిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
10వ వార్డులో 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం


