హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాగునీటి వృథాను అరికట్టాలి'

NRPT: మండలంలోని మద్దిగట్ల గ్రామంలో హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ పత్తి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఉమర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిస్తూ వృథాను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపి తదితరులు పాల్గొన్నారు.