హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో అక్రమ మైనింగ్..!

AKP:  జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోడవరం నియోజకవర్గం బెన్నవోలు ప్రాంతంలో రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో అక్రమంగా తవ్వకాలు సాగుతున్నట్లు సమాచారం. రోజూ వందలాది ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.