SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలాస నియోజకవర్గ ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శిరీష


