KNR: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, క్రెడిట్ కార్డు అప్పుల భారంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జమ్మికుంట మండలం గండ్రపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ రావు (30) చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.
తెలంగాణ
అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్య


