హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ ప్రాంతంలో మద్యం అమ్మితే రూ. 50వేల జరిమానా

KMR: మద్యపాన నిషేధానికి పిట్లం (M) తిమ్మానగర్ గ్రామం శ్రీకారం చుట్టింది. సర్పంచ్ ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సమావేశమై గ్రామంలో మద్యం విక్రయించవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే రూ. 50 వేల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అక్రమ విక్రయాలపై సమాచారం అందించిన వారికి రూ. 5 వేల బహుమానం అందజేస్తామనన్నారు.