హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో యువకుడిపై దాడి

అన్నమయ్య: మదనపల్లె పరిధిలోని చిన్నతిప్పసముద్రంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారంతో బీహార్ యువకుడు ముకేశ్‌పై ఐదుగురు దాడికి పాల్పడ్డారు. ప్లంబర్ పైపులతో గంటలపాటు చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. రూమ్‌మేట్స్ ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.