JN: జనగామలో ఈ నెల 26న అండర్–15 చెస్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ నిర్వాహకులు జయచంద్ర, మధు తెలిపారు. 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఈ నెల 24 తేదీలోపు రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజుతో నమోదు చేసుకోవాలన్నారు. 26న ఉదయం 9 గంటల్లోపు రిపోర్టింగ్ చేయాలని, 10 గంటలకు తొలి రౌండ్ ప్రారంభమవుతుందన్నారు.
తెలంగాణ
జనగామలో ఈనెల 26న అండర్–15 చెస్ ఎంపికలు


