హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు

TPT: నాయుడుపేట పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణాలు కొనసాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ నిబంధనలు పాటించాలని కమిషనర్ ప్రజలకు సూచించారు.