ASR: కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ ఉసిరికపాడు గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాకాలంలో బురదమయంగా మారడంతో వాహనాలు వెళ్లడం కష్టంగా మారుతోంది. గ్రామానికి మంజూరైన రహదారి పనులు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉసిరికపాడుకు రహదారి సౌకర్యం కరువు


