హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై గుంతలతో వాహనదారుల అవస్థలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మహబూబ్‌‌నగర్ చౌరస్తా వరకు రహదారి అధ్వానంగా మారింది. చిన్నచిన్న గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ డిపో సమీపంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో గతంలో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.