హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జస్టిస్ శ్రీనివాస రెడ్డికి స్వాగతం పలికిన ఎస్పీ

ఏలూరు జిల్లా పర్యటనకు శనివారం వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డిని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. న్యాయవ్యవస్థ, పోలీసు శాఖల మధ్య సమన్వయం, కేసుల దర్యాప్తు, న్యాయపరమైన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.