హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమతిలేని భవన నిర్మాణాలపై కొరడా..!

GNTR: తెనాలి పట్టణంలోని 26, 27వ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్‌లను పరిశీలించి, అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణ పనులను గుర్తించారు. వెంటనే వాటిని నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.