హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

GDWL: గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు నెలల పాప మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. చెనుగొనిపల్లికి చెందిన చిన్నారిని అనారోగ్యంతో మూడు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స అందించారు. శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో మళ్లీ తీసుకురాగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.