ADB: గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామ పంచాయతీలో శనివారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సేద్మకి పద్మ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. GPO మహేశ్, ఉప సర్పంచ్ షైనాజ్, అలీమ్ ఖాన్, రమేశ్, భీం రావు, తదితరులున్నారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి'


