హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూటీపై పర్యటించిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి సవిత స్కూటీపై పర్యటించారు. పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని స్థానికులను ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.