హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతలమయంగా ప్రధాన రహదారి

ASF: కౌటాల మండల కేంద్రం నుంచి ముత్తంపేట్ వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాల ముప్పు ఉంది. వర్షం నీరు గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు మరింత ఇబ్బంది కలుగుతోంది. రహదారి పరిస్థితిపై అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.