హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహిళా సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమం

ఏలూరు: మహిళా పోలీసు సిబ్బందికి శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సి.ఆర్.రెడ్డి నర్సింగ్ కాలేజ్ ప్రొఫెసర్ మనీషా.. గుండెపోటు, ఆకస్మికంగా గుండె స్పందన ఆగిపోయినప్పుడు ప్రాథమిక చికిత్సగా సీపీఆర్ చేసే విధానాన్ని వివరించారు. అత్యవసర వేళల్లో భయపడకుండా వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు.