హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సారపాకను హరిత నగరంగా తీర్చిదిద్దాలి'

BDK: బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గుగులోత్ శివరాం కిషోర్ నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంచి కాలుష్యాన్ని నియంత్రించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. సారపాకను హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.