ASF: కౌటాల మండలం తలోడి గ్రామంలో వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. కొంపరి గౌరక్క రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగుడు ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. చెవికమ్మలను సైతం లాగడంతో ఆమె కేకలు వేయగా దుండగుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సీఐ సురేశ్ కుమార్ శనివారం ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు చోరీ


